MS dhoni: ధోనీ, రోహిత్ శర్మ.. చక్కని కెప్టెన్ ఎవరు?

who is the better captain between MS dhoni and rohit sharma

  • వీరిలో ఉత్తమ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు చాట్  జీపీటీ తెలివైన సమాధానం
  • వ్యక్తిగత ప్రాధాన్యం, దృక్కోణం నుంచే తేల్చుకోవాలని సూచన
  • ఇద్దరూ భారత జాతీయ జట్టుకు మంచి విజయాలు తెచ్చినట్టు విశ్లేషణ

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ.. ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ అయితే, మరొకరు ప్రస్తుత కెప్టెన్. ఇద్దరూ సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారే. మరి వీరిలో ఉత్తమ కెప్టెన్ ఎవరు? అన్న సందేహం చాలా మందికి వస్తుంటుంది. కొందరు అయితే ఎలాంటి సందేహం లేకుండా ధోనీయే నంబర్ 1 కెప్టెన్ అని చెబుతుంటారు. నిజానికి ఫలితాలను విశ్లేషించినట్టయితే రోహిత్ శర్మ కంటే ధోనీ ముందుంటాడు. అలా అని రోహిత్ శర్మనూ తీసిపారేయడానికి లేదు. అతడూ కెప్టెన్  గా సమర్థుడే. ఇదే ప్రశ్నను ఇటీవలే అందుబాటులోకి వచ్చి బాగా ప్రాచుర్యం సంపాదించుకున్న చాట్ జీపీటీని అడిగితే.. అది కూడా చాలా తెలివిగా, కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్టు సమాధానం ఇచ్చింది.

ఇలా చెప్పింది..
‘‘ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ మధ్య కెప్టెన్ గా పోల్చి చూడడం అన్నది ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలకే పరిమితం.  ధోనీ, శర్మ ఇద్దరూ కూడా భారత క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్లే. చెప్పుకోతగ్గ విజయాల దిశగా జాతీయ జట్టును నడిపించారు. 

భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీని ఎంతో విజయవంతమైన కెప్టెన్ గా పరిగణిస్తారు. అతడి నాయకత్వంలో భారత్ ఎన్నో టోర్నెమెంట్లు గెలుచుకుంది. 2007 ఐసీసీ వరల్డ్ టీ20 కప్, 2011లో ఐసీసీ వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలను సొంతం చేసుకుంది. ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. చక్కని నడవడిక, వ్యూహ చతురత, ఒత్తిడితో కూడిన సందర్భాలను ఎదుర్కొనే సామర్థ్యాలు అతడి సొంతం. 

ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా, ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో తనదైన ముద్రను వేసుకున్నవాడే. 2018 ఆసియాకప్, 2018లో నిడహాస్ ట్రోఫీ విజయాల దిశగా టీమిండియాను నడిపించాడు. శర్మ కెప్టెన్ గా తన చురుకైన నిర్ణయాలు, దూకుడైన బ్యాటింగ్, తన సహచరుల నుంచి మంచి ఫలితాలను రాబట్టే సామర్థ్యాలున్నవాడు. అంతిమంగా ధోనీ, శర్మలో ఎవరు మెరుగైన కెప్టెన్ అన్నది విడిగా ఒక్కొక్కరి వ్యక్తిగత ప్రాధాన్యతలు, దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ కూడా వినూత్నమైన నాయకత్వ శైలి కలిగినవారు. ఎన్నో విజయాలు సాధించిన పెట్టారు’’ అని చాట్ జీపీటీ తన కృత్రిమ బుర్ర సాయంతో విశ్లేషించింది.

More Telugu News