Vijay Antony: 'బిచ్చగాడు 2' తొలిరోజు వసూళ్లు ఇవే!

Bichagadu 2 movie update

  • నిన్న థియేటర్లకు వచ్చిన 'బిచ్చగాడు 2'
  • మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా 
  • తమిళంతో సమానంగా తెలుగులో ఆదరణ 
  • వీకెండులో మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్  

విజయ్ ఆంటోని నుంచి గతంలో వచ్చిన 'బిచ్చగాడు' భారీ విజయాన్ని సాధించడంతో, 'బిచ్చగాడు 2' పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు .. తమిళ భాషల్లో నిన్ననే ఈ సినిమా విడుదలైంది. థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే కనిపించింది. అందువలన మంచి ఓపెనింగ్స్ ను ఈ సినిమా రాబట్టినట్టుగా చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 4.10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తమిళనాడుతో సమానంగా తెలుగు వసూళ్లు ఉన్నాయని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 8.15 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని చెబుతున్నారు. 

విజయ్ ఆంటోని ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చు పెట్టాడు. ఫస్టాఫ్ కి ఎక్కడా వంక బెట్టడానికి ఉండదు. సెకండాఫ్ లో మాత్రం ఒకటి రెండు చోట్ల కథనం కాస్త మందగిస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. వీకెండులో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

More Telugu News