Naresh: త్వరలోనే పవిత్రా లోకేశ్‌ ను పెళ్లి చేసుకుంటా: నరేశ్

actor naresh says he wants marry pavitra lokesh

  • నిజానికి పెళ్లి అనేది అంత కచ్చితంగా అవసరం లేదన్న నరేశ్
  • ఇద్దరి మనసులు కలవడంతో కలిసి ఉంటున్నామని వెల్లడి
  • తమకు ఇంకా పెళ్లి కాలేదని, త్వరలోనే చేసుకుంటామని వ్యాఖ్య

ప్రముఖ సినీ నటుడు నరేశ్‌ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమా ప్రమోషన్స్ లో క్రేజీ జంట పవిత్రా లోకేశ్‌, నరేశ్ ఫుల్ బిజీగా ఉన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవిత్రా లోకేశ్‌ ను పెళ్లి చేసుకోబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. 

‘‘నిజానికి పెళ్లి అనేది అంత కచ్చితంగా అవసరం లేదు. చాలా మంది ఇష్టం లేకుండా, సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వారికోసమే 'మళ్లీ పెళ్లి' సినిమా’’ అని అన్నారు. ‘‘నాకు, పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలవడంతో కలిసి ఉంటున్నాం. అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు.
 
‘మళ్లీ పెళ్లి’ సినిమాలో పవిత్రా లోకేశ్‌, వనితా విజయ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది.

More Telugu News