Nara Lokesh: నేను మంత్రిగా శిలాఫలకం వేసిన ప్రతి అభివృద్ధి పని పూర్తయింది: లోకేశ్

Lokesh Yuvagalam in Nandyal constituency

  • నంద్యాల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • రైతులతో ముఖాముఖి
  • రాయలసీమ రైతుల పాలిట శని జగన్ రెడ్డి అంటూ విమర్శలు
  • వంగలేకపోతే ఎవరో రాయి తెచ్చిస్తే టెంకాయ కొట్టడం అభివృద్ధి కాదన్న లోకేశ్

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కి.మీ. మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నంద్యాల రూరల్ కానాలలో పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

రాయలసీమ రైతులపాలిట శని జగన్ రెడ్డి!

రాయలసీమ రైతుల పాలిట శని జగన్ అని... రాయలసీమ బిడ్డనని చెబుతూ ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయకుండా తీరని ద్రోహం చేస్తున్నాడని నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారని వెల్లడించారు. జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. 

"జగన్ తన చేతగానితనాన్ని వాతావరణంపై తోసేసి రైతులకు అన్యాయం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గించి వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం" అని తెలిపారు.

రైతుల భూములు లాక్కుంటున్నారు!

వైసీపీ నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారని లోకేశ్ ఆరోపించారు. మంత్రి బుగ్గన నియోజకవర్గంలో రైతు రవికి అన్యాయం జరిగితే కనీసం స్పందించలేదని తెలిపారు. "బుగ్గన అనుచరులే రైతులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రవికి టీడీపీ అండగా ఉంటుంది. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాది. రైతులను వైసీపీ ప్రభుత్వం నిత్యం అవమానిస్తోంది. ధాన్యం కొనమని అడిగితే ఒక మంత్రి ఎర్రిపప్ప అని తిట్టి రైతులను అవమానించారు. కర్నూలు నుండి వలసలు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడిన తరువాత నాకు బాధ కలిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తాం" అని హామీ ఇచ్చారు.

నారా లోకేశ్ ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసిన అమెరికా వెళుతున్న యువ‌కులు

ఏపీలోని నిరుద్యోగుల‌కి శిక్షణ ఇచ్చి విదేశాల‌లో ఉద్యోగాలు క‌ల్పించే వేదికగా టీడీపీ సాధికారత కేంద్రం వేదికగా నిలిచింద‌ని నారా లోకేశ్ ప్రశంసించారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఎంప‌వ‌ర్ మెంట్‌ సెంట‌ర్ లో శిక్షణ పూర్తిచేసుకుని అమెరికా వెళుతున్న విద్యార్థులు గురువారం నంద్యాల యువ‌గ‌ళం పాద‌యాత్ర క్యాంప్ సైట్ వ‌ద్ద నారా లోకేశ్ ను క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. వీరితోపాటు ర‌వికుమార్ వేమూరు (ఎన్ఆర్ఐ టీడీపీ), మ‌ల్లిక్ మేద‌ర‌మెట్ల (టీడీపీ ఎంప‌వ‌ర్ మెంట్ యూఎస్ఏ కోఆర్డినేట‌ర్‌), గ‌రిమెళ్ల రాజ‌శేఖ‌ర్ (ఆర్థోపెడిక్ స‌ర్జన్), విశాఖ‌ప‌ట్నం ఉన్నారు.  

తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలోని టీడీపీ ఎంప‌వ‌ర్ మెంట్ సెంటర్ లో లో కామర్స్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు అక్కౌంట్స్ లో టాలీ-బుక్ కీపింగ్, సాఫ్ట్‌వేర్ లో జావా, పైథాన్, డేటా అనలిటిక్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపిస్తున్నారు.

యూఎస్ఏలో టీచర్, హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్ జాబ్స్ కి పంపిస్తున్నారు. పూర్తి ఉచితంగా శిక్ష‌ణ అందించి ట్రైనీలు, అప్రెంటిషిప్, ఇంట‌ర్న్‌షిప్‌ గా విదేశాల‌లో యువ‌త‌కి ఉద్యోగ‌-ఉపాధి అవ‌కాశాలు చూపిస్తున్నారు.

ప‌ల్లెప్రగ‌తిలో నా కృషికి ఆన‌వాళ్లు... ఈ శిలాఫ‌ల‌కాలు!

నంద్యాల నియోజకవర్గం కానాల గ్రామంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర సందర్భంగా యువనేత లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పాదయాత్ర కొనసాగుతుండగా ఆశ్చర్యక‌రంగా నేను పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రిగా వేసిన శిలాఫ‌ల‌కాలు క‌నిపించాయి. 

మ‌రింత ఆస‌క్తి పెరిగి, ఈ ప‌నుల‌న్నీ పూర్తయ్యాయో, లేదోన‌ని చూశాను. ప్రతీ అభివృద్ధి ప‌నీ పూర్తయ్యింది. శంకుస్థాప‌న చేసిన మేమే ప్రారంభోత్సవం కూడా చేశాం. ఇదీ మా విశ్వస‌నీయ‌త‌. ఇదీ తెలుగుదేశం క‌మిట్మెంట్‌. 

పంచాయ‌తీరాజ్ మంత్రిగా నేను ప‌ల్లె ప్రగ‌తికి చేసిన కృషికి ఆన‌వాళ్లు ఈ శిలాఫ‌ల‌కాలు... జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే వంగ‌లేక ఎవ‌రో రాయి తెస్తే దానిపై టెంకాయ కొట్టడం, స్టంప్స్‌పై టెంకాయ కొట్టడం, చంద్రబాబు చేసిన శంకుస్థాప‌న‌ల్ని ధ్వంసం చేసి... పేర్లు మార్చి కొత్త శిలాఫ‌ల‌కాలు వేయ‌డం కాదు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారూ" అంటూ చురకలు అంటించారు.


*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1319.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 17.3 కి.మీ.*

*104వ రోజు (19.5.2023) పాదయాత్ర వివరాలు*

*నంద్యాల/బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు (నంద్యాల జిల్లా)*

మధ్యాహ్నం

2.00 – నంద్యాల నియోజకవర్గం రాయపాడు శివార్లలో తటస్థ ప్రముఖులతో ముఖాముఖి.

3.00 – రాయపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.10 – బనగానపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశం. టంగుటూరు పెద్దమ్మతల్లి గుడి వద్ద మాటామంతీ.

3.45 – టంగుటూరులో రైతులతో సమావేశం.

సాయంత్రం

5.20 – అప్పలాపురంలో వడ్డెర సామాజికవర్గీయులతో సమావేశం.

6.40 – కైపలో యాదవులతో సమావేశం.

7.05 – కైప శివారు విడిది కేంద్రంలో బస.

********

  • Loading...

More Telugu News