Pawan Kalyan: 'పాపం పసివాడు' కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on Janasena Kathakali video

  • రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందన్న సీఎం జగన్
  • జగన్ వ్యాఖ్యలపై కథాకళి పేరిట జనసేన వీడియో
  • చర్చలో పాల్గొన్న నాగబాబు, వేములపాటి అజయ్ కుమార్

ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది కాస్ట్ వార్ (కులాల మధ్య యుద్ధం) కాదని, క్లాస్ వార్ అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఓ వ్యంగ్యాస్త్రం సంధించింది. పార్టీ అధికార ప్రతినిధి వేముల పాటి అజయ్ కుమార్ తో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఓ సెటైరికల్ స్కిట్ తరహాలో వీడియో రూపొందించారు. కథాకళి పేరిట రూపొందించిన ఈ వీడియోలో జగన్ వ్యాఖ్యల క్లిప్పింగ్... క్లాస్ వార్ అంటే ఏమిటన్నది అజయ్ బాబును అడిగి నాగబాబు తెలుసుకోవడం వంటి ఘట్టాలు ఉన్నాయి. 

జనసేన పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్న ఈ వీడియోపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. క్లాస్ వార్ అంటే ఏమిటో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, పార్టీ అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ ఇన్చార్జి వేములపాటి అజయ్ కుమార్ చర్చా వేదిక కథాకళిలో చెప్పారని వెల్లడించారు. 

'పాపం పసివాడు' కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి అని పవన్ హితవు పలికారు. ఈ మేరకు వీడియోను కూడా పంచుకున్నారు. 'పాపం పసివాడు' అంటూ జనసేన ఇప్పటికే సీఎం జగన్ పై ఓ వ్యంగ్య పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News