Naresh: బలవంతంగా కాపురం చేయడం చిత్రహింసే: నరేశ్

Naresh opines on Malli Pelli movie

  • నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా మళ్లీ పెళ్లి చిత్రం
  • దర్శకత్వం వహించిన ఎంఎస్ రాజు 
  • ఈ నెల 26న విడుదల
  • ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న నరేశ్, పవిత్ర

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మళ్లీ పెళ్లి' చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ సినిమాకు నరేశ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. 

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు నరేశ్... పవిత్రా లోకేశ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

"ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యపై తీసిన చిత్రం ఇది. సమాజంలో 50 శాతం మందికి పైగా దంపతులు సంతోషంగా లేరు. పరిస్థితులు, సమాజం వారితో బలవంతంగా కాపురం చేయిస్తున్నాయి. అది నిజంగా చిత్రహింసే. కొందరు ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి ధైర్యంగా బయటికి వస్తున్నారు. ఇలాంటి వారి కోసం సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది... మీరు కోరుకున్నట్టుగా జీవించే హక్కు మీకుందని పేర్కొంది. మళ్లీ పెళ్లి చిత్రం ఏ ఒక్కరినో ఉద్దేశించి తీసింది కాదు. చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే కాబట్టి ఈ చిత్రంతో కనెక్ట్ అవుతున్నారు" అని నరేశ్ వివరించారు.

Naresh
Pavitra Lokesh
Malli Pelli
MS Raju
Tollywood
  • Loading...

More Telugu News