Saitheja: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో 'హసీనా'

Hasina Movie Update

  • ప్రియాంక డే ప్రధాన పాత్రగా 'హసీనా'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఆసక్తిని పెంచిన ట్రైలర్ 
  • ఈ నెల 19వ తేదీన విడుదల

ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ లకు .. హారర్ థిల్లర్ లకు .. క్రైమ్ థ్రిల్లర్ లకు ఆదరణ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కంటెంట్ ను ప్రేక్షకుల ముందు ఉంచడానికి మేకర్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఈ జోనర్లో కొత్త పాయింటును టచ్ చేస్తే చాలు, మంచి వసూళ్లను రాబడుతున్నాయి. 

అలా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన మరో సినిమానే 'హసీనా'. నాయిక ప్రధానమైన కథ ఇది. టైటిల్ రోల్ ను ప్రియాంక డే పోషించింది. తన్వీర్ .. సాయితేజ గంజి .. శివగంగ తదితరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తన్వీర్ నిర్మించిన ఈ సినిమాకి, నవీన్ దర్శకత్వం వహించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను నవనీత్ చారి సమకూర్చాడు. 
  
'హసీనా' మూవీ పోస్టర్ ని ప్రకాశ్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా యంగ్ హీరోలు ఈ సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాను మే 19న థియేటర్లలో  విడుదల చేయనున్నారు.

Saitheja
Shivaganga
Hasina Movie
Priyanka Dey

More Telugu News