TSPSC paper leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో కొత్త కోణం

Wives of TSPSC paper leak case accused appear for exams

  • కేసులోని ఇద్దరు నిందితుల భార్యలు కూడా టీఎస్‌పీఎస్‌సీ పరీక్షకు హాజరు
  • సిట్ ఆధికారుల దర్యాప్తులో వెల్లడి
  • కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల భార్యలు కూడా టీఎస్‌పీఎస్‌సీ పరీక్షకు హాజరయినట్టు సిట్ పోలీసులు తాజాగా గుర్తించారు. కమిషన్ నెట్వర్క్ విభాగం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ (డీపీఓ) ప్రశ్న పత్రం సాయంతో పరీక్ష రాసినట్టు దర్యాప్తులో తేలింది.  

ఇక నిందితురాలు రేణుక రాథోడ్‌కు పరిచయస్తుడైన రాహుల్ ఆమె వద్ద అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. రేణుక భర్త ఢాక్యానాయక్ నుంచి నాగార్జునసాగర్‌కు చెందిన రమావత్ దత్తు ఏఈ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశాడు. ఈ కేసులో నిందితులు, పరీక్ష రాసిన అభ్యర్థుల కాల్‌డేటాను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TSPSC paper leak
  • Loading...

More Telugu News