Santhosh Sobhan: ఇది విజయ్ దేవరకొండ కోసం రాసుకున్న కథ: నందినీ రెడ్డి

Nandini Redddy Interview

  • ఈ నెల 18న రానున్న 'అన్నీ మంచి శకునములే'
  • స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • అలా సంతోష్ లైన్లోకి వచ్చాడన్న నందినీ రెడ్డి

నందినీ రెడ్డి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అన్నీ మంచి శకునములే' రెడీ అవుతోంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా, స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి మాట్లాడారు. 

"సాధారణంగా నేను కథను రాసుకున్న తరువాత ఏ పాత్రకి ఎవరు బాగుంటారా అనేది చూస్తాను. కానీ 'అన్నీ మంచి శకునములే' కథను మాత్రం చాలా కాలం క్రితమే విజయ్ దేవరకొండను అనుకుని రాసుకున్నాను. అయితే అప్పటికే విజయ్ దేవరకొండ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ప్రేక్షకులు ఆయనను చూడాలనుకుంటున్న విధానం మారిపోయింది" అని అన్నారు. 

స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమాను చేద్దామని అనుకున్న తరువాత, తనే నాకు సంతోష్ శోభన్ పేరును  సూచించింది. స్క్రీన్ టెస్ట్ చేస్తే అతను ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అయ్యాడు. అందువలన అతనిని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాపై నాకంటే స్వప్నకి నమ్మకం ఎక్కువ ఉంది. ఆ నమ్మకాన్ని చూసి నాకు భయం వేస్తూ ఉంటుంది" అంటూ నవ్వేశారు.

More Telugu News