Roja Ramani: తరుణ్ రీ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది: రోజా రమణి

Roja Ramani Interview

  • బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ 
  • ఫస్టు మూవీతోనే హిట్ అందుకున్న హీరో 
  • లవర్ బాయ్ గా యూత్ లో క్రేజ్
  • మళ్లీ అతను యాక్టింగ్ పై దృష్టి పెడతాడన్న రోజా రమణి 

రోజా రమణి బాలనటిగానే వెండితెరకి పరిచయమయ్యారు. ఆమె తనయుడిగా తరుణ్ కూడా బాలనటుడిగానే తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన మరికొన్ని సినిమాలు తరుణ్ ను లవర్ బాయ్ గా నిలబెట్టాయి. 

తరుణ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాదాపు పెద్ద పెద్ద బ్యానర్లలోనే ఆయన సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయితే వరుస ఫ్లాపుల కారణంగా ఆయన వెనకబడ్డాడు. ఆ సమయంలో బిజినెస్ పై దృష్టి పెట్టి.. ఆ వైపే ఫుల్ ఫోకస్ పెట్టాడు. అలా సినిమాలకి మరింత దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో తరుణ్ గురించి రోజా రమణి ప్రస్తావించారు. 

తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకటి సినిమా అయితే .. మరొకటి వెబ్ సిరీస్. ఏది ముందుగా పూర్తవుతుందనేది చూడాలి. తనని ఇంతకుముందు మాదిరిగానే ప్రేక్షకులు ఆదరించాలనీ, త్వరలోనే తన పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

Roja Ramani
Tharun
Tollywood
  • Loading...

More Telugu News