YS Sharmila: కేసీఆర్ గారు, ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి: షర్మిల

Sharmila demands KCR sign on affidavit over TSPSC exams

  • టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి విమర్శలు
  • ఇకపై ఎలాంటి లీకులు ఉండవని కేసీఆర్ భరోసా కల్పించాలని డిమాండ్
  • పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని సంతకం పెట్టాలన్న షర్మిల

టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇకపై టీఎస్ పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో భరోసా కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ మీద సంతకం చేయాలని డిమాండ్ చేశారు.  

‘కేసీఆర్ గారు, పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అనే మహా బిల్డప్ ఇస్తారు కదా, మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి. టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్ఠంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా? పిల్లలకోసం ఆలోచిస్తున్నవారైతే, వారి బతుకులతో ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి’ అని షర్మిల ట్వీట్ చేశారు.

‘80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు, ఒక సీఎం సంతకంపెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండి’ అని షర్మిల సవాల్ విసిరారు.

YS Sharmila
YSRCP
Telangana
TSPSC
Exams
affidavit
KCR
  • Loading...

More Telugu News