Santhosh Sobhan: స్టార్స్ తో సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు: నందినీ రెడ్డి

Nandini Redddy Interview

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'అన్నీ మంచి శకునములే'
  • సంతోష్ శోభన్ జోడీకట్టిన మాళవిక నాయర్ 
  • కథకి తగిన ఆర్టిస్టుల గురించే ఆలోచిస్తానన్న నందినీ రెడ్డి 
  • ఈ నెల 18వ తేదీన విడుదలవుతున్న సినిమా

ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేయడంలో నందినీ రెడ్డి సిద్ధహస్తురాలు. ప్రేమ .. కుటుంబ బంధాలు .. సున్నితమైన భావోద్వేగాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. అలాంటి ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అన్నీ మంచీ శకునములే' సినిమా ముస్తాబవుతోంది. సంతోష్ శోభన్ - మాళవిక జంటగా నటించిన సినిమా ఇది. ఈ నెల 18న విడుదల కానుంది.  

తాజా ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి మాట్లాడుతూ .. "నేను ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా చేస్తాననీ .. లేదంటే చిన్న హీరోలతో మాత్రమే సినిమాలను తీస్తానని అంటూ ఉంటారు. ఇక పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటని కూడా అడుగుతూ ఉంటారు. నా స్టైల్ నాది అని మాత్రమే నేను సమాధానం చెప్పగలను" అన్నారు. 

"నేను ఒక కథను తయారు చేసుకున్నాక హీరో పాత్రకు ఎవరు సెట్ అవుతారని ఆలోచన చేస్తానుగానీ, ఏ స్టార్ తో చేస్తే బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే స్టార్స్ కావలసినట్టుగా నేను చేయలేను. నాకు కావలసింది స్టార్స్ కాదు .. యాక్టర్స్. 'అన్నీ మంచి శకునములే' సినిమాను, 'ఓ బేబీ' కంటే ముందుగానే చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది" అని చెప్పుకొచ్చారు.

Santhosh Sobhan
Malavika Nair
Anni Manchi Shakunamule Movie
  • Loading...

More Telugu News