Nani: 'దసరా'తో నాని తెచ్చిన లాభాలు ఇవే!

Dasara Movie Update

  • నానీని మాస్ హీరోగా నిరూపించిన 'దసరా'
  • ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల వసూళ్లు
  • 14.55 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన సినిమా 
  • ఇతర భాషల్లో అంతగా లభించని ఆదరణ 

తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ఒకటిగా 'దసరా' కనిపిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా మాస్ లుక్ తో నాని నటించిన ఈ సినిమాలో, కీర్తి సురేశ్ డీ గ్లామర్ రోల్ చేసింది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల గ్రాస్ ను .. 63.55 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 14.55 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. నాని చేసిన ఫస్టు పాన్ ఇండియా సినిమా .. 100 కోట్ల క్లబ్ లోకి ఆయన చేరిన ఫస్టు సినిమా ఇదే కావడం విశేషం. నాని డీసెంట్ గా ఉండే పాత్రలను మాత్రమే చేయగలడు అనే విమర్శలను ఆయన ఈ సినిమాతో తిప్పికొట్టాడు. కథ .. కథనం .. యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్స్ .. ఇలా అన్ని అంశాలలోను ఈ సినిమా మంచి మార్కులను తెచ్చుకుంది. ఇక సారా తాగే సీన్స్ బాగా ఎక్కువైపోయాయనే విమర్శలు కూడా రాకపోలేదు. తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ సినిమా అంతగా ఆడకపోవడం గమనార్హం.

Nani
Keerthy Suresh
Srikanth Odela
Dasara Movie
  • Loading...

More Telugu News