Priyadarshi: 'బలగం' తెచ్చిన లాభం ఎంతంటే ..!

Balagam movie update

  • గ్రామీణ నేపథ్యంతో వచ్చిన 'బలగం'
  • తొలి రోజునే దక్కిన హిట్ టాక్ 
  • తెలుగు రాష్ట్రాల్లో 26.86 కోట్ల గ్రాస్ 
  • ప్రపంచవ్యాప్తంగా 27.30 కోట్ల షేర్

ఈ మధ్య కాలంలో తెలుగులో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన వాటిలో 'బలగం' ముందువరుసలో కనిపిస్తుంది. దిల్ రాజు సమర్పణలో .. వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అనూహ్యమైన విజయాన్ని సాధించింది. హడావిడి జీవితాల్లో ఆవిరవుతున్న అనుబంధాలను తట్టి లేపింది. కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు జనంలోనే ఒక కదలిక తీసుకొచ్చింది. 

తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏ రోజుకు ఆ రోజు వసూళ్లను పెంచుకుంటూ వెళ్లింది. చివరికి ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది. తెలంగాణలోని ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ అల్లుకున్న ఈ కథ, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. 

అలాంటి ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 26.86 కోట్ల గ్రాస్ ను, 12.35 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 27.30 కోట్ల గ్రాస్ ను, 12.55 కోట్ల షేర్ ను వసూలు చేసింది. పెట్టుబడికి నాలుగింతల లాభాన్ని ఈ సినిమా తీసుకొచ్చిందనేది టాక్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 

More Telugu News