Pakistan: పోలీసులను చూసి కోర్టులోకి పరుగెత్తిన పాక్ మాజీ మంత్రి

Imran Khans aide Fawad Chaudhry evades rearrest by dashing into court building

  • ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద నాటకీయ సన్నివేశం
  • అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి కోర్టులోకి పరుగెత్తిన మాజీ మంత్రి ఫవాద్
  • మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన జడ్జి

ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకుడు ఫవాద్ చౌదరి కోర్టు ఆవరణలో పరుగెత్తాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు వద్ద మంగళవారం నాటకీయ సన్నివేశం చోటు చేసుకుంది. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి సదరు మాజీ మంత్రి ఫవాద్ కోర్టులోకి పరుగు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీంతో పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫవాద్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్ట్ పై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, పోలీసులు అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన కోర్టు నుండి బయటకు వచ్చి, తన కారు ఎక్కి వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఆయన కారును అడ్డుకొని, మరో కేసులో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో అతను కారు దిగి, వేగంగా కోర్టు లోపలకు పరుగెత్తారు.

తనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జడ్జి మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆయన పరుగెత్తుతున్న సమయంలో కోర్టు ప్రాంగణంలో కిందపడిపోగా, లాయర్లు వచ్చి, ఆయనను లోపలకు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News