Anand Devarakonda: రష్మిక చేతుల మీదుగా 'బేబీ' లిరికల్ సాంగ్ రిలీజ్!

Baby lyrical song released

  • రొమాంటిక్ కామెడీ డ్రామాగా 'బేబీ'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్ స్టోరీ  
  • ఆనంద్ దేవరకొండ జోడీగా వైష్ణవి చైతన్య 
  • సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గనిన్

ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. 

ఎస్కే ఎన్ ఈ సినిమాను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్, హైదరాబాద్ - పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ - స్క్రీన్ 1లో జరిగింది. రష్మిక చేతుల మీదుగా ఈ సినిమా నుంచి 'ప్రేమిస్తున్నా' అనే  లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'ప్రేమిస్తున్నా ... ప్రేమిస్తున్నా .. నీ ప్రేమలో జీవిస్తున్నా' అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ పాటకి సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు.  రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో నడిచే ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News