Varun Tej: జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అంటూ జాతీయ మీడియాలో కథనం... ఇది నిజమేనా?

Is Varun Tej and Lavanya Tripathi set to tie the knot

  • వరుణ్ తేజ్ పెళ్లిపై పింక్ విల్లా సౌత్ మీడియా సంస్థ కథనం
  • లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి ఈ ఏడాదే ఉంటుందని వెల్లడి
  • ఇద్దరూ పార్టీలు, ఫంక్షన్లలో జంటగా కనిపించేవారని వివరణ

విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిపై జాతీయ మీడియాలో ఓ వార్త గుప్పుమంది. అందాల భామ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని పింక్ విల్లా సౌత్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిపింది. 

కొన్నాళ్లుగా వీరు జంటగా పార్టీలకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరయ్యారని, అయితే తామిద్దరి మధ్య అనుబంధాన్ని వారు కొట్టిపడేసేవారని ఆ మీడియా సంస్థ వివరించింది. తామిద్దరం స్నేహితులం మాత్రమేనని చెప్పేవారని పింక్ విల్లా సౌత్ వెల్లడించింది. 

అయితే, ఈ కథనంలో నిజం ఎంత అన్నది మెగా కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన వస్తే తప్ప నిర్ధారించలేం. కనీసం లావణ్య త్రిపాఠి అయినా దీనిపై ఏదైనా హింట్ ఇస్తే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Varun Tej
Lavanya Tripathi
Engagement
Wedding
Tollywood
  • Loading...

More Telugu News