soyam bapurao: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారంపై సోయం బాపూరావు స్పందన

Soyam Bapurao says he will not leaving BJP

  • కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆవేదన
  • తన కొడుకు పెళ్లికి పార్టీలకతీతంగా అందర్నీ ఆహ్వానిస్తానని వెల్లడి
  • కర్ణాటకలో గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదన్న సోయం

అదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై సోయం స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా తప్పుడు ప్రచారం సాగుతోందని, అర్థం లేని ఆరోపణలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన తన కొడుకు పెళ్లి ఉందని, ఈ పెళ్లికి అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపిస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరినీ పిలుస్తున్నానని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని చెప్పడం సరికాదన్నారు.

తన తనయుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల వద్దకు కూడా వెళ్తానని చెప్పారు. ఇటీవలి వరకు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తానే బీజేపీలోకి ఆహ్వానించానని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాల్లేవన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాననే ప్రచారం వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదని, అక్కడ బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని గుర్తు చేశారు.

soyam bapurao
BJP
Congress
  • Loading...

More Telugu News