: దేశం పరువు తీశాడీ ఎయిరిండియా ఉద్యోగి


కావేవీ స్మగ్లింగ్ కు అనర్హం అనుకున్నాడో ఏమో, 'వీటినా స్మగ్లింగ్ చేస్తున్నాడు' అని ముక్కున వేలేసుకునే వస్తువును స్మగ్లింగ్ చేస్తూ లండన్ లో పట్టుబడ్డాడో ఎయిరిండియా ఉద్యోగి. స్మగ్లింగ్ అంటే గంధపు చెక్కలు, ఎర్రచందనం, పంచలోహ విగ్రహాలు, అరుదైన జంతువులు, మాదక ద్రవ్యాలు, బంగారం అని ఇంతవరకూ అనుకున్న వారికి కళ్లు బైర్లుకమ్మేలా సిగిరెట్లు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఎయిర్ ఇండియా కేబిన్ సిబ్బంది ఉద్యోగి 50 సిగిరెట్ల క్రేట్లను స్మగ్లింగ్ చేస్తూ లండన్ పోలీసులకు పట్టుబడి నేరం అంగీకరించాడు. అతనిని 8 గంటల పాటు నిర్భందించారు లండన్ ఎయిర్ పోర్టు పోలీసులు. దీంతో ఎయిరిండియా 5 వేల పౌండ్లు చెల్లించి అతనిని విడుదల చేయించింది. అనంతరం అతనిని విధులనుంచి తొలగించింది.

  • Loading...

More Telugu News