Anasuya: సుమతిగా బోల్డ్ క్యారెక్టర్లో అన‌సూయ భర‌ద్వాజ్!

Vimanam Movie Update

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'విమానం'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • కీలకమైన పాత్రను పోషించిన అనసూయ
  • జూన్ 9వ తేదీన సినిమా విడుదల    

అనసూయ భరద్వాజ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీ. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విమానం' రెడీ అవుతోంది. జీ స్టూడియోస్ - కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ దర్శకత్వం వహించాడు. 
 
ఈ సినిమాలో అనసూయ గ్రామీణ యువతిగా కనిపించనుంది .. ఆమె పాత్ర పేరు సుమతి. ఈ రోజున ఈ సినిమా నుంచి అనసూయకి సంబంధించిన గ్లింప్స్ ను .. పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆమె చాలా సెక్సీగా కనిపిస్తోంది. ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండనుందనే విషయం పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. 

ఇది తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కథ. తండ్రిగా వీరయ్య పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. ఆయన కొడుకు పాత్రను మాస్టర్ ధృవన్ పోషించాడు. రాజేంద్రన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

Anasuya
Samudrakhani
Vimanam Movie
  • Loading...

More Telugu News