Nikhil: భారీ యాక్షన్ దృశ్యాలతో ఆసక్తిని పెంచుతున్న 'స్పై' .. టీజర్ రిలీజ్!

Spy movie teaser released

  • నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై'
  • ఆయన జోడీకట్టిన ఐశ్వర్య మీనన్ 
  • కీలకమైన పాత్రలో మకరంద్ దేశ్ పాండే 
  • జూన్ 29న ఐదు భాషల్లో విడుదల  

నిఖిల్ హీరోగా 'స్పై' సినిమా రూపొందింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. నిఖిల్ జోడీగా ఐశ్వర్య మీనన్ నటించింది. శ్రీచరణ్ పాకాల - విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యాన్ని గురించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ దృశ్యాలు .. ఛేజింగ్స్ పై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 'మన చరిత్ర నీ చేతుల్లో ఉంది' .. 'ఈ నిజం మనం ప్రపంచానికి చెప్పాలి' .. అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ స్థాయి యాక్షన్ సినిమా చేయడం నిఖిల్ కి ఇదే మొదటిసారి కావొచ్చు.

ఈ సినిమాలో అభినవ్ గౌతమ్ .. మకరంద్ దేశ్ పాండే ముఖ్యమైన పాత్రలను పోషించారు. నిఖిల్ కి 'కార్తికేయ 2' సినిమాతో నార్త్ లోను మంచి మార్కెట్ ఏర్పడింది. అందువలన ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో జూన్ 29వ తేదీన విడుదల చేస్తున్నారు. 'స్పై'గా నిఖిల్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడనేది చూడాలి.

Nikhil
Aishwarya Menon
Abhinav
Spy Movie

More Telugu News