Uday Kumar Reddy: ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సీబీఐ కోర్టు
- వివేకా హత్య కేసులో ఇటీవల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్
- సీబీఐ కోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డికి చుక్కెదురు
- బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారన్న సీబీఐ న్యాయవాది
- సీబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇటీవల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఉదయ్ కుమార్ రెడ్డికి తాజాగా సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.