KPHB Colony: కేపీహెచ్బీ కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్య

Lovers suicide in KPHB Colony

  • మృతులు భీమవరం సమీప గ్రామానికి చెందినవారు
  • ప్రియుడు ఉరి వేసుకుని, ప్రియురాలు విషం తాగి ఆత్మహత్య
  • యువతికి గతంలోనే వివాహం జరిగినట్టు సమాచారం

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి గత 20 రోజులుగా కేపీహెచ్బీ కాలనీలోని ఒక వసతిగృహంలో ఉంటోంది.

శ్యామ్ స్నేహితుడు కృష్ణ కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్ లో ఉంటున్నాడు. ఇటీవలే కృష్ణ వద్దకు శ్యామ్ వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో గది తాళాలు అడిగి తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం శ్యామ్, జ్యోతి కృష్ణ గదికి వచ్చారు. ఈ ఉదయం నుంచి రూమ్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా... ఇద్దరూ విగతజీవులపై కనిపించారు. శ్యామ్ ఉరి వేసుకుని, జ్యోతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు జ్యోతికి గతంలోనే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KPHB Colony
Hyderabad
Lovers
Suicide
  • Loading...

More Telugu News