Rachamallu Siva Prasad Reddy: లోకేశ్ వెయ్యి రోజులు పాదయాత్ర చేసినా ప్రయోజనం ఉండదు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

YSRCP MLA Rachamallu comments on Nara Lokesh padayatra
  • తండ్రిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికే పాదయాత్ర అన్న రాచమల్లు 
  • లోకేశ్ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని జోస్యం
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులైనా, వెయ్యి రోజులైనా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఆయన పాదయాత్ర వల్ల నయాపైసా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. తన తండ్రిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికే ఈ పాదయాత్ర అని చెప్పారు. ప్రొద్దుటూరుకు లోకేశ్ పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అల్లుడిలా వచ్చి వెళ్లిపోతాడని అన్నారు. ఇచ్చిన హామీలను కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తోందని చెప్పారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని జోస్యం చెప్పారు.
Rachamallu Siva Prasad Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News