Raviteja: మరోసారి రవితేజ జోడీకడుతున్న త్రిష!

Trisha in Anudeep Movie

  • త్రిషకి పెరుగుతున్న ఆఫర్లు
  • టాలీవుడ్ నుంచి జరుగుతున్న సంప్రదింపులు 
  • రవితేజతో అనుదీప్ సినిమాకి సన్నాహాలు 
  • 'కృష్ణ' తరువాత రవితేజతో త్రిష చేస్తున్న సినిమా ఇది

త్రిష ఒకప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోను .. ఈ సినిమా ఈవెంట్స్ లోను ఆమెనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత నుంచి ఆమెకి వివిధ భాషల నుంచి భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఎప్పటిలానే తమిళ సినిమాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. 

తెలుగు సినిమాలకి సంబంధించి ఆమె ఇక్కడి తెరపై కనిపించక చాలా కాలమే అయింది. అలాంటి త్రిషకి ఇప్పుడు ఇక్కడి నుంచి వరుస ఆఫర్లు వెళుతున్నాయని వినికిడి. ఇక్కడి సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా ఆమెను ఒప్పించడానికి గట్టిగానే సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ జోడీగా ఒక సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'జాతిరత్నాలు'అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. గతంలో రవితేజ - త్రిష 'కృష్ణ' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

Raviteja
Trisha
Anudeep
  • Loading...

More Telugu News