Ram Pothineni: రామ్ - బోయపాటి మాస్ ‘థండర్’ అదిరిపోయిందిగా!

Boyapati RAPO First Thunder released

  • రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా
  • రామ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్
  • ప్రతి ఫ్రేమ్ లో బోయపాటి మార్క్.. అదిరిపోయిన నేపథ్య సంగీతం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి చిన్న టీజర్ లాంటిది విడుదల చేశారు. ‘ఫస్ట్ థండర్’ పేరుతో రిలీజ్ చేసిన 1.08 నిమిషాల వీడియో మొత్తం యాక్షన్ సీన్లతో నింపేశారు. ప్రతి ఫ్రేమ్ లో బోయపాటి మార్క్ కనిపిస్తోంది. 

‘‘నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సూ..’’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. దున్నపోతును పట్టుకుని చేసే ఫైట్, థమన్ నేపథ్య సంగీతం అదిరిపోయింది.

రామ్ పోతినేని తన పేరును షార్ట్ కట్ లో రా.పో. అని పెట్టుకుంటారు. అదే పదంతో ‘ర్యాపో’ అంటూ వచ్చే పాట హైలైట్. ఈ టీజర్ కు మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కోసం రామ్ చాలా బరువు పెరిగినట్టు కనిపిస్తున్నారు. అందుకే బొద్దుగా ఉన్నారు. తొలి సారి ఈ స్థాయిలో మాస్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


Ram Pothineni
Boyapati Sreenu
First Thunder
Sreeleela
Thaman S

More Telugu News