Nara Lokesh: లోకేశ్ పాదయాత్రలో ఉత్సాహంగా నడిచిన కుటుంబసభ్యులు.. ఫొటోలు ఇవిగో

Nara Lokesh family members in padayatra

  • 100వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • శ్రీశైలం జిల్లా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరణ
  • లోకేశ్ కు మద్దతుగా పాదయాత్రలో నడిచిన కుటుంబ సభ్యులు

వైసీపీ పాలనను వ్యతిరేకిస్తూ టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. 100వ రోజు పాదయాత్రను నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంపు సైట్ నుంచి లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్రకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. లోకేశ్ కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వీరిలో లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి, లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు ఉన్నారు. వీరంతా కూడా లోకేశ్ తో కలిసి ఉత్సాహంగా నడిచారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 100 రోజుల పాదయాత్రకు గుర్తుగా శ్రీశైలం నియోజకవర్గం మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించారు. 

More Telugu News