National Medical Commission: కొత్త రూల్.. ఇకపై భారత్‌లోని వైద్యులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య

Government makes unique ID mandatory for doctors

  • నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త మార్గదర్శకాలు
  • దేశవ్యాప్తంగా వైద్యుల వివరాలతో ఉమ్మడి రిజిస్టర్
  • రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి ఐదేళ్ల కాలపరిమితిపై లెసెన్స్ జారీ
  • లైసెన్స్ ముగిసే మూడు నెలల లోపు రెన్యూవల్‌కు అనుమతి

భారత్‌లోని డాక్టర్లందరికీ ఇకపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్‌సీ) కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌ఎమ్‌సీ ఎథిక్స్ బోర్డు ఈ సంఖ్యను జారీ చేస్తుంది. తద్వారా వైద్యుల పేర్లను జాతీయ మెడికల్ రిజిస్ట్రీలో నమోదు చేయడంతో పాటూ వారికి దేశంలో ప్రాక్టీసు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. దేశంలోని ప్రతి వైద్యుడికి ఈ యూనీక్ ఐడీ నెంబర్ తప్పనిసరి. 

ఎన్ఎమ్‌సీ తాజా నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని వైద్యులందరి కోసం ఉమ్మడిగా ఓ నేషనల్ మెడికల్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవే వివరాలతో మరో రిజిస్టర్ ఎథిక్స్ బోర్డు వద్ద కూడా ఉంటుంది. రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్ వద్ద ఉన్న రిజిస్టర్లలోని వైద్యుల వివరాలన్నీ ఈ జాతీయ రిజిస్టర్‌లో చేరుస్తారు. వైద్యులకు సంబంధించి తగు వివరాల్ని ఈ రిజస్టర్‌లో పొందుపరస్తారు. 

రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్న వైద్యులకు 5 ఏళ్ల కాలపరిమితపై వైద్య వృత్తిని ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్స్ జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వైద్యులు తమ లైసెన్స్ పునరుద్ధరణ కోసం స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరో మూడు నెలల్లో కాలపరిమితి ముగుస్తుందనగా వైద్యులు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

National Medical Commission
  • Loading...

More Telugu News