Vijay Antony: 'బిచ్చగాడు 2' మరో సంచలనం సృష్టించేనా?

Bichagadu 2 movie update

  • విజయ్ ఆంటోని హీరోగా 'బిచ్చగాడు 2'
  • కథానాయికగా సందడి చేయనున్న కావ్య థాపర్
  • అందరిలోను పెరుగుతున్న ఆసక్తి 
  • ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు    

విజయ్ ఆంటోనికి తమిళంలోనే కాదు, తెలుగులోను ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లోని కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆయన కథల్లో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా, మంచి ప్రయత్నం అనే అభినందనలు దక్కడం విశేషం. 

ఆయన హీరోగా వచ్చిన 'బిచ్చగాడు' ఇక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అనువాద సినిమాలకి సంబంధించి ఇక్కడ ఒక కొత్త రికార్డుకు తెరతీసింది. ఆ సినిమా తరువాత ఆ స్థాయిలో ఆయనకి ఇక్కడ మరో విజయం లభించలేదు. దాంతో మరోసారి తన జోరును కొనసాగించే ప్రయత్నంలో భాగంగా 'బిచ్చగాడు 2'తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. 

'బిచ్చగాడు' సినిమాకి శశి దర్శకుడు అయితే, సెకండ్ పార్టు దర్శకత్వ బాధ్యతలను విజయ్ ఆంటోని తీసుకున్నాడు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కానుంది. హరీశ్ పేరడీ ..  జాన్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మరో సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.

Vijay Antony
Kavya Thapar
Hareesh Peradi
Bichagadu 2
  • Loading...

More Telugu News