Santosh Sobhanj: నాన్నతో సినిమా చేయలేకపోయాను .. మీతో చేశాను చాలు: సంతోష్ శోభన్

Anni Manchi Sakunamule Pre Release Event

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అన్నీ మంచి శకునములే'
  • నందినీ రెడ్డి నుంచి వస్తున్న మరో విభిన్న కథా చిత్రం 
  • ఆమె దర్శకత్వంలో చేసే ఛాన్స్ రావడం గర్వకారణమన్న సంతోష్ 
  • సీనియర్ స్టార్స్ తో చేయడం అదృష్టమని వెల్లడి 
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల  


సంతోష్ శోభన్ కి ఈ మధ్య వరుస ఫ్లాపులు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆయన చేసిన 'అన్నీ మంచి శకునములే' సినిమా, ఈ నెల 18వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు.

ఈ వేదికపై సంతోష్ శోభన్ మాట్లాడుతూ .. "నాని గారు  - దుల్కర్ గారు నా సినిమా ఫంక్షన్ కి రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఆనందంతో నాకు మాటలు రావడం లేదు. నిర్మాతగా స్వప్నక్క పని తీరును చూస్తే, సినిమాపట్ల నాకున్న అంకితభావం సరిపోదేమోనని అనిపిస్తూ ఉంటుంది" అని అన్నాడు. 

"నాకు మా నాన్నతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. నందినీ రెడ్డిగారితో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది .. ఇది నాకు చాలు. ఈ రోజున ఈ స్టేజ్ పై నుంచుని నేను నవ్వుతూ మాట్లాడుతున్నానంటే అందుకు ఆమెనే కారణం. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఈ సినిమా చాలాకాలం పాటు మీతో ట్రావెల్ చేస్తుంది .. ఇది నా మాట" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News