Man Watches IPL Match On His Phone Inside Stadium: ఇతడో రకం.. స్టేడియంలోనే ఉన్నా.. ఫోన్ లో మ్యాచ్ చూస్తున్నాడు.. ఇదిగో వీడియో!

Man Watches IPL Match On His Phone Inside Cricket Stadium

  • స్టేడియంలో సీట్లపై పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూస్తూ కనిపించిన వ్యక్తి
  • మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కామెంట్ల వర్షం

క్రికెట్ మ్యాచ్ లను స్టేడియంలో చూడాలని ఎందరో అభిమానులు ఆశపడుతుంటారు. అయితే టికెట్లు దొరక్కపోవడంవల్లో, అంత రేటు పెట్టి టికెట్లు కొనలేకనో, టైమ్ లేకనో.. ప్రత్యక్షంగా చూడలేకపోతుంటారు. ఇక స్టేడియంలో చూసేందుకు చాన్స్ దొరికిన వాళ్ల ఆనందానికి అవధులుండవు. అరుపులు, కేరింతలతో తమ టీమ్స్ ను సపోర్ట్ చేస్తుంటారు. 

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా? అదిగో అక్కడికే వస్తున్నా.. స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను ఫోన్ లో చూస్తూ కనిపించాడో వ్యక్తి. ఒక పక్క స్టేడియంలో జనాలు తమ అభిమాన క్రికెటర్లను చూసి కేరింతలు కొడుతుంటే.. ఇంకోపక్క ఖాళీగా ఉన్న సీట్లను వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూశాడీ వింత మనిషి. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘స్టేడియంలోకి వెళ్లి.. ఫోన్ లో చూడటమేమిటి?.. అదేదో ఇంట్లోనే చూసుకోవచ్చు కదా!’ అని ప్రశ్నిస్తున్నారు. 

‘‘పాపం.. దూరంగా ఉన్నాడు కదా ఆట సరిగ్గా కనిపించలేదేమో’’ అని ఒకరు.. ‘‘12 గంటల్లోపు డేటా ఎలాగైనా అవ్వగొట్టేందుకు పడుతున్న పాట్లు ఇవి’’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొకరైతే.. ‘‘ఆఫీసులో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ కు హాజరైనట్లు ఉంది’’ అని జోక్ చేశారు.

Man Watches IPL Match On His Phone Inside Stadium
CSK
Delhi
Cricket
Viral Videos

More Telugu News