VV Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు చెప్పిన వైసీపీ

YCP thanked CBI former JD VV Lakashmi Narayana

  • చుక్కల భూముల సమస్యను సరిదిద్దే కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్
  • వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన లక్ష్మీనారాయణ
  • ఇది జగనన్న ప్రభుత్వం... మన రైతన్న ప్రభుత్వం అని పేర్కొన్న వైసీపీ

చుక్కల భూముల సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి సీఎం జగన్ ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన సభలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 

దీనిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన పత్రాలు త్వరలో లభిస్తాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. 

సీబీఐ మాజీ జేడీ ట్వీట్ పై వైసీపీ సోషల్ మీడియాలో స్పందించింది. థాంక్యూ లక్ష్మీనారాయణ గారూ అంటూ బదులిచ్చింది. ఇది జగనన్న ప్రభుత్వం.... మన రైతన్న ప్రభుత్వం అని పేర్కొంది. 

దశాబ్దాల నాటి చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి రైతుల భూములకు సర్వ హక్కులు కల్పించిన రైతు బాంధవుడు సీఎం జగన్ అని వైసీపీ కీర్తించింది. ఇదీ... రైతన్నల పట్ల జగనన్న ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని పేర్కొంది.

VV Lakshminarayana
CBI
JD
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News