Sachin Tendulkar: మదర్స్ డే సందర్భంగా సచిన్ స్పెషల్​ ఫొటో!

Sachin shares photo with his mother

  • ఈ రోజు అంతర్జాతీయ మదర్స్ డే
  • తమ తల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రముఖులు
  • తల్లి ఆశీర్వాదం ఇస్తున్న ఫొటోను షేర్ చేసిన సచిన్

అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా ఈ రోజు తమ మాతృమూర్తులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తన తల్లితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భర్తీ చేయలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ఆశీర్వాదం మాత్రమే అన్నాడు. తల్లి తనను ఆశీర్వదిస్తున్న ఫొటోను పంచుకున్నాడు.

More Telugu News