Vimanam: అడిగినవన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు... నాన్న అంటారు... 'విమానం' టీజర్ విడుదల

Teaser from Vimanam movie out now

  • సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధానపాత్రల్లో 'విమానం'
  • శివప్రసాద్ యానాల దర్శకత్వంలో చిత్రం
  • జూన్ 9న థియేటర్లలో రిలీజ్

సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విమానం'. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అఫీషియల్ టీజర్ విడుదలైంది. "అడిగినవన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు... నాన్న అంటారు" అంటూ మనసును కదిలించే డైలాగులతో టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'విమానం' చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్, ధన్ రాజ్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, 'నాన్ కడవుళ్' రాజేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

Vimanam
Teaser
Samuthirakani
Master Dhruvan
Sivaprasad Yanala
Tollywood

More Telugu News