Basavaraj Bommai: కర్ణాటక బీజేపీ కార్యాలయంలో కింగ్ కోబ్రా
- బసవరాజు బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన పాము
- భయాందోళనలకు గురైన నాయకులు, కార్యకర్తలు
- కింగ్ కోబ్రాను పట్టుకొని అడవిలో వదిలేసిన వైనం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా కర్ణాటక షిగాన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక అవాంఛనీయ సంఘటన గందరగోళానికి కారణమైంది. ఆఫీస్ లోని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో ఓ కోబ్రా కనిపించింది. బొమ్మై కార్యాలయానికి వచ్చిన కాసేపటికి కోబ్రాను గుర్తించిన కార్యకర్తలు, నాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ పామును పట్టి, అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఈ పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.