Naga Chaitanya: తొలి రోజు కస్టడీ కలెక్షన్లు అంతేనా.. !

Poor opening for custody movie

  • నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్ లో సినిమా
  • నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • మొదటి రోజు రూ. రెండున్నర కోట్లు వసూలు!

అక్కినేని కుటుంబాన్ని వరస పరాజయాలు వెంటాడుతున్నాయి. అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు నాగ చైతన్య, కృతి శెట్టి కాంబినేషన్ లో శుక్రవారం విడుదలైన ‘కస్టడీ’ కూడా అదే బాటలో పయనించేలా ఉంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ ద్విభాషా చిత్రంపై చైతన్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు. జోరుగా ప్రమోషన్స్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. 

అరవింద్ స్వామి, శరత్ కుమార్, రాంకీ వంటి ప్రముఖ తమిళ నటులు ఉన్నా.. ఇళయరాజా సంగీతం అందించినా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలుస్తోంది. మొదటి రోజే కలెక్షన్స్ లో తేలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కస్టడీ సినిమా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే రాబట్టినట్టు సమచారం. ముఖ్యమైన నైజాం ఏరియా నుంచి రూ.75 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా థియేటర్ హక్కులు సుమారు రూ.21 కోట్ల వరకు అమ్ముడయ్యానని సమాచారం. తొలి రోజు కలెక్షన్స్ చూస్తే ఆ మొత్తం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Naga Chaitanya
custody
movie
opening
  • Loading...

More Telugu News