Brahmanandam: బ్రహ్మానందం ప్రచారం చేసిన అభ్యర్థి ఓటమి

BJP candidate sudhakar campaigned by Brahmanandam was defeated in chikkaballapur

  • చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి సుధాకర్ తరఫున ప్రచారం చేసిన బ్రహ్మానందం
  • 11,130 ఓట్ల తేడాతో ఓడిపోయిన సుధాకర్
  • కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం

తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశారు. అయితే అక్కడ సుధాకర్ ఓడిపోయారు.

11,130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. ఈశ్వర్ కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్ కు 57878 ఓట్లు పడ్డాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 

ఏపీకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. నాడు సుధాకర్ గెలుపొందారు. ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. సుధాకర్ తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రచారం చేయించారు. కానీ ఈ సారి సెంటిమెంట్ రిపీట్ కాలేదు.

More Telugu News