Karnataka: లీడింగ్ లో కాంగ్రెస్.. ఢిల్లీలో అప్పుడే ప్రారంభమైన సంబరాలు

Congress workers celebrations at AICC office in Delhi

  • స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్
  • 117 స్థానాల్లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్
  • మిఠాయిలు పంచుకుంటున్న పార్టీ శ్రేణులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 117 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 73, జేడీఎస్ 29, ఇతరులు 5 సీట్లలో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

More Telugu News