Chandrababu: మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు... రెండో ఎర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు: చంద్రబాబు

Chandrababu slams Jagan and Karumuri

  • తణుకులో రైతు పోరు బాట
  • 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు
  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ
  • చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
  • జగన్, కారుమూరిపై చంద్రబాబు విసుర్లు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తణుకులో రైతు పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చంద్రబాబు దారి పొడవునా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడారు. చంద్రబాబుకు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...

•  ధాన్యంలో తేమ ఉన్నా, మొలక వచ్చినా కొంటాము అని ప్రకటన ఇచ్చారు. ఆ ధాన్యం కొన్నారా అని నేను అడుగుతున్నా
•  మనం పంట అమ్మితే మనకు డబ్బులు ఇవ్వాలి. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే... మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.
•  లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు.
•  ఆర్బీకేల వల్ల రైతులకు ఏం లాభం వచ్చిందో చెప్పాలి. ఆర్బీకే కేంద్రాలు దగా కేంద్రాలు అయ్యాయి.

•  ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడుగుతున్నా
• అకాల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది... ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు? 
•  విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి సాయం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఈ అకాల వర్షాలకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోలేదు?
•  ఏప్రిల్ 1 వ తేదీన రబీ ధాన్యం సేకరించాలి. కానీ ఎందుకు ధాన్యం సేకరణ చేపట్టలేదు.?
•  కేజీ చక్కెర కొంటే కేజీనే ఇస్తారు... కానీ ఇక్కడ ధాన్యం సంచికి 40 కేజీలకు 42 కేజీలు ఎందుకు తీసుకుంటున్నారు?
•  తేమ, తరుగు, నూక పేరుతో అదనంగా డబ్బులు గుంజుతున్నారు. దీని వల్ల బస్తాకు రూ.200 నుంచి రూ. 300 పోతుంది. అంటే ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల నష్టం వస్తుంది. ప్రభుత్వం నాపై దాడి చేయడం కాదు. దీనికి సమాధానం చెప్పాలి

•  చేతనైతే నాతో పోటీపడి రైతులకు సాయం చేయాలి కానీ నాపై విమర్శలు కాదు.
•  నేటి ఈ పాదయాత్ర... వైసీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర అవుతుంది.
•  రైతుల పంటలకు బీమా అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రభుత్వం బీమా కట్టడం లేదు.
•  ఈ ముఖ్యమంత్రి లేచింది మొదలు చెప్పేది అసత్యాలే. ఈ సీఎం కళ్లార్పకుండా అబద్ధాలు చెపుతాడు. ఒక్క బాబాయి కేసులోనే ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూశాం.
•  ఈ సమావేశం ద్వారా అడుగుతున్నా రబీకి ఇన్స్యూరెన్స్ కట్టారా... ఏ పొలంలో అయినా క్రాప్ కటింగ్ ఎక్సపెరిమెంట్ జరిగిందా ? 

•   ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రైతుకు తిరిగి ఇవ్వాలి.
•  రవాణా ఖర్చులు, తరుగు, నూక పేరుతో వసూలు చేసిన మొత్తాలను రైతుకు చెల్లించాలి
•  జగన్ కు అర్థం కాకపోవచ్చు... కానీ నేర్చుకోవాలనే ఆలోచన లేదు.
•  ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనాలి... కొన్న ధాన్యానికి వెంటనే మద్దతు ధర రైతుకు చెల్లించాలి.

•  మీ డబ్బులు ఇప్పించడానికి నేను సిద్దంగా ఉన్నా.....రైతులు కూడా నాతో కలిసి పోరాటానికి కదలిరావాలి.
•  రైతాంగంలో ధైర్యం రావాలి... ఈ ప్రభుత్వం బెదిరిస్తుందని భయపడకండి. సమస్యలపై నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది.
•  ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు... పోలీసులను పెట్టి రైతులను బెదిరించాడు, ఇలాంటి వాళ్లను నా జీవితంలో చాలా మందిని చూశా

•  నేరస్తుడికి అధికారం ఇవ్వొద్దంటే నాడు మీరంతా వినలేదు, ఒక చాన్స్ అంటే కరిగిపోవద్దు అని నాడే చెప్పాను. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుంది... ఇప్పుడు అదే అయ్యింది.
•  ఈ ప్రభుత్వానికి నాలుగు డిమాండ్లు పెడుతున్నాను.
•  దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, వరికి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి
•  హార్టికల్చర్ పంటలకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి
•  ఇన్ స్యూరెన్స్ కట్టలేదు కాబట్టి... నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి.
•  ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు మనం పోరాడుదాం... ప్రభుత్వం అప్పటికీ ఇవ్వకపోతే...మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నష్టపరిహారం ఇస్తాం.

•  ఇప్పుడు చుక్కల భూములు అంటున్నాడు... సర్వే అంటున్నాడు. ఈ విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
•  జగన్ కు పిచ్చి ముదిరింది... ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది.
•  నేను రైతు వ్యతిరేకి అని జగన్ అంటున్నాడు... నేను 5 ఏళ్లు ఏం చేశానో.... నువ్వు ఏం చేశావో చర్చకు సిద్దమా ? 
•  నాడు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇచ్చాం....యంత్రాలు ఇచ్చాం....రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం.
•  రైతుకు అండగా నిలిచినపార్టీ టీడీపీ... రైతును నిండాముంచిన పార్టీ వైసీపీ
•  మళ్లీ జగన్ గెలిచేది లేదు... జగన్ పని అయిపోయింది.

•  ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు...అతను ఎర్రిపప్ప. అంటే అర్థం బుజ్జినాన్న. 
•  ఇతను వెర్రిపప్పా... బుజ్జినాన్నా? మా అచ్చెన్న చెప్పినట్లు మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు... రెండో వెర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు
•  రైతులపై ప్రేమ ఉంటే వెంటనే జగన్ కారుమూరిని మంత్రిపదవి నుంచి తొలగించాలి
•  మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనలేని మంత్రి మనపై విమర్శలు చేస్తున్నాడు

•  45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.... ఈ మంత్రులు నన్ను బెదిరిస్తారా?
•  ఈ మంత్రి అనుకుంటే నేను తణుకు దాటనా... తీవ్ర వాదులతో పోరాడిన పార్టీ టీడీపీ. ఆకు రౌడీలకు భయపడతానా? 
•  రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతల తప్పులు అన్నీ లెక్క పెడుతున్నా... అన్నిటికీ బదులిస్తా.
•  ఈ రోజు సభ నుంచి చెపుతున్నా... కౌలు రైతును ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా

  • Loading...

More Telugu News