Raja Singh: మంత్రి తలసానిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు

Raja Singh praises Talasani

  • గోషామహల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అందజేత కార్యక్రమం
  • హాజరైన తలసాని, మహమూద్ అలీ, రాజాసింగ్
  • తలసాని బాగా పని చేస్తున్నారన్న రాజాసింగ్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి తలసానిపై ప్రశంసలు కురిపించారు. తలసాని చాలా బాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈరోజు తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజాసింగ్ కూడా హాజరయ్యారు. ముగ్గురూ కలిసి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను అందించారు. 

ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... కొంత లేట్ అయినా ఇప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని అన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఇక్కడ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. మరికొందరు కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని అన్నారు.  

Raja Singh
BJP
Talasani
BRS
  • Loading...

More Telugu News