tspsc: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుక సహా ఐదుగురి కస్టడీకి ఈడీ పిటిషన్

ED files petition in court for custody of TSPSC accused

  • రేణుక, రాజేశ్వర్, డాక్యా, గోపాల్, నీలేష్‌ల కస్టడీ కోరిన ఈడీ
  • నిందితులకు నోటీసులు జారీ చేసిన కోర్టు
  • కౌంటర్ దాఖలు చేయనున్న నిందితుల తరఫు న్యాయవాదులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. రేణుక, రాజేశ్వర్, డాక్యా, గోపాల్, నీలేష్.. ఐదుగురిని తమ కస్టడీకి అప్పగించాలని విచారణ సంస్థ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిన్న నిందితురాలు రేణుకతో పాటు మరొకరు జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే.

tspsc
renuka
Telangana
paper leak
  • Loading...

More Telugu News