naresh: ఆ నిర్వచనం ప్రకారం పవిత్రతో నా పెళ్లయిపోయినట్లే: నరేశ్

Naresh Opens Up About Marriage Rumors With Pavitra

  • తాము పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
  • నరేశ్, పవిత్ర జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ 
  • ఈ నెల 26న విడుదల కానున్న సినిమా

తాను పవిత్రా లోకేశ్ ను పెళ్లి చేసుకున్నానని చాలా మంది అనుకుంటున్నారని, అందులో నిజం లేదని సీనియర్ నటుడు నరేశ్ చెప్పారు. తన దృష్టిలో పెళ్లంటే రెండు హృదయాల సంగమం అని అన్నారు. ఆ నిర్వచనం ప్రకారం తమ ఇద్దరి పెళ్లయిపోయినట్లేనని అభిప్రాయపడ్డారు. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో నరేశ్, పవిత్ర హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నరేశ్.. పవిత్రతో తన పెళ్లి వార్తలపై స్పందించారు. తనకు వివాహ వ్యవస్థపై గొప్ప నమ్మకం ఉందన్నారు. పెళ్లి గొప్పతనాన్ని ఈ సినిమాలో తెలియజెప్పామని, కథానుగుణంగా చక్కటి టైటిల్‌ కుదిరిందని అన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి డీఓపీగా వ్యవహరించగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

More Telugu News