Chahal: చహల్ మ్యాజిక్... అంతమంది హిట్టర్లున్నా కోల్ కతా కొట్టింది 149 పరుగులే!

Chahal restricts KKR for 149 runs

  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ ఢీ
  • టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్
  • 4 వికెట్లతో నైట్ రైడర్స్ ను దెబ్బకొట్టిన చహల్

జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్... ఇలా కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే అందరూ హిట్టర్లే. కానీ రాజస్థాన్ రాయల్స్ తో పోరులో కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. అందుకు కారణం యజువేంద్ర చహల్. 

ఈ బక్కపలుచని లెగ్ స్పిన్నర్ తన స్పిన్ మ్యాజిక్ తో కోల్ కతాను కట్టడి చేశాడు. చహల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. చహల్ తెలివైన బౌలింగ్ కు వెంకటేశ్ అయ్యర్ (57), నితీశ్ రాణా (22), రింకూ సింగ్ (16), శార్దూల్ సింగ్ (1) బోల్తా పడ్డారు. ట్రెంట్ బౌల్ట్ 2, సందీప్ శర్మ 1, కేఎం ఆసిఫ్ 1 వికెట్ తో రాణించారు. 

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (10), రహ్మనుల్లా గుర్బాజ్ (18) తొలి పవర్ ప్లేలోనే వెనుదిరిగారు. 

అనంతరం, ఎడమచేతివాటం వెంకటేశ్ అయ్యర్ పలు భాగస్వామ్యాలతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అయ్యర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఇతర బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో కోల్ కతా భారీ స్కోరు సాధించలేకపోయింది. కోల్ కతా బ్యాటింగ్ లైనప్ ను చహల్ ఎక్కడా కుదురుకోనివ్వలేదు.

ఇక 150 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్ ను నితీశ్ రాణా వేయగా ఆ ఓవర్లో యశస్వి జైస్వాల్ 3 ఫోర్లు 2 సిక్సులతో మొత్తం 26 పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర జోస్ బట్లర్ రనౌట్ అయ్యాడు.

  • Loading...

More Telugu News