tspsc: చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితురాలు రేణుక

Renuka released from chanchalguda jail

  • టీఎస్‌పీఎస్సీ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న రేణుక
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • పూచీకత్తు సమర్పించడంతో సాయంత్రం విడుదల

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో  ఏ3 నిందితురాలు రేణుక బెయిల్ పై విడుదలయింది. నాంపల్లి కోర్టు బుధవారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. గురువారం రేణుక తరఫు న్యాయవాదులు పూచీకత్తు సమర్పించడంతో కోర్టు బెయిల్ కాపీలను జారీ చేసింది. బెయిల్ ఆర్డర్ కాపీ అందడంతో జైలు అధికారులు రేణుకను విడుదల చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుకను పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పలువురు నిందితులు అరెస్టయ్యారు. నాటి నుండి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. రేణుక అనారోగ్యం పాలు కావడం, మహిళ కావడం, దర్యాఫ్తు చివరి దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరయింది.

tspsc
renuka
Telangana
Crime News
  • Loading...

More Telugu News