Kethika sharma: చూపులతో మత్తెక్కిస్తున్న కేతిక శర్మ!

Kethika Sharma Special

  • 'రొమాంటిక్'తో మెరిసిన కేతిక శర్మ 
  • గ్లామర్ పరంగా దక్కిన మంచి మార్కులు 
  • పలకరించని సక్సెస్ లు 
  • సరైన ఛాన్స్ కోసమే వెయిటింగ్

తెలుగు తెరకి కృతి శెట్టి .. శ్రీలీలతో పాటు పరిచయమైన బ్యూటీ కేతిక శర్మ. ఈ ఢిల్లీ బ్యూటీ 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా ఫస్టు పోస్టర్ తోనే ఆమె కుర్రాళ్ల మనసులను కాజేసింది. అందాలను ఆరబోయడంలో ఎంత మాత్రం వెనకాడకపోవడంతో, కొంతకాలం పాటు ఆమె జోరు కొనసాగుతుందని అంతా అనుకున్నారు.అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాల పరంగా ఆ సినిమా కనెక్ట్ కాకపోయినా, గ్లామర్ పరంగా మాత్రం ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. అందువల్లనే ఆ తరువాత 'లక్ష్య' .. ' రంగరంగ వైభవంగా' సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. 'లక్ష్య'లో ఆమెకి నటనకి మాత్రమే కాదు, గ్లామర్ పరంగా కూడా స్కోప్ లేకపోవడంతో ఆమె అభిమానులను ఆ సినిమా నిరాశపరిచింది. ఇక 'రంగరంగ వైభవంగా' ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారుగానీ, ఆశించినస్థాయికి చేరుకోలేకపోయింది. సినిమాలు లేవనే మాటేగానీ, ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె మాత్రం సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. అవకాశాల కోసం ఫొటో షూట్ లు కానిస్తూనే ఉంది. తాజాగా వదిలిన ఫొటోలు చూస్తే, మత్తుకళ్లతోనే మనసులు చదివేస్తున్నట్టుగా ఉంది. త్వరలో మంచి ఛాన్స్ పట్టేస్తుందేమో చూడాలి మరి.

Kethika sharma
Actress
Tollywood
  • Loading...

More Telugu News