Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్

SC Reserves Verdict On Petitions Seeking Legal Recognition Of Same Sex Marriages

  • పదిరోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం
  • స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా కేంద్రం వాదనలు
  • ఈ వివాహాలకు గుర్తింపును ఇచ్చే అంశం సంక్లిష్టమైనదని కోర్టుకు తెలిపిన కేంద్రం

భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అత్యున్నత న్యాయస్థానం పది రోజుల పాటు విచారణ జరిపి, నేడు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్సార్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నర్సింహులు ఉన్నారు.

స్వలింగ వివాహాల చట్టబద్ధతకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. స్వలింగ వివాహాలకు గుర్తింపును ఇచ్చే అంశం చాలా సంక్లిష్టమైనదని కోర్టుకు తెలిపింది. సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపించే ఈ అంశాన్ని పార్లమెంటుకు వదిలివేయాలని కోరింది. రాష్ట్రాల చట్టసభలతో పాటు పౌర సమాజంలోను దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశానికి సంబంధించి ఏడు రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పందన వచ్చిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు పిటిషనర్ల వాదనలతో విబేధించినట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News