: యూపీఏ సమన్వయ కమిటీ భేటీ
ప్రధాని మన్మొహన్ సింగ్ నివాసంలో యూపీఎ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఆహార భద్రత బిల్లు, మావోయిస్టుల సమస్యలపై సమన్వయ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆహార భద్రత బిల్లుపై యూపీఏ లోని అన్ని పక్షాలు కలిసివచ్చి బిల్లు పాస్ అయ్యేలా చూసేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ సమావేశం నిర్వహించింది.
ఈ మధ్య కాలంలో ఏ సమావేశాలు జరిగినా ప్రతిపక్షాలు యూపీఏ అవినీతి, జాతీయ భద్రత వంటి విషయాలపై నిలదీస్తూ సభలను స్థంభింపజేస్తుండడంతో వాటి వ్యూహాలను తిప్పికొట్టేందుకు ఏ రకమైన వ్యూహాలు ప్రయోగించాలంటూ యూపీఏ సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన మారణకాండ భవిష్యత్తులో పునరావృతం కాకుండా అంతర్గత భద్రత విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకునేందుకు మావోబాధిత రాష్ట్రాల్లో ప్రత్యేక బలగాల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చిస్తోంది.