Vijay: 'లియో' కోసం హైదరాబాద్ వస్తున్న విజయ్ .. క్లైమాక్స్ ఇక్కడే!

Leo movie update

  • లోకేశ్ కనగరాజ్ దర్శకుడిగా 'లియో'
  • విజయ్ జోడీ కడుతున్న త్రిష 
  • కీలకమైన పాత్రలో సంజయ్ దత్ 
  • అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల

విజయ్ హీరోగా 'లియో' సినిమా రూపొందుతోంది. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'మాస్టర్' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. విజయ్ సరసన నాయికగా త్రిష నటిస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. విజయ్ ... అర్జున్ .. ఇతర ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

ఇక్కడ చిత్రీకరించే కీలకమైన సీన్స్ కోసం ప్రత్యేమైన సెట్ వేయిస్తున్నారని అంటున్నారు. ఇది చివరి షెడ్యూల్ షూటింగు .. దీనితో షూటింగు పార్టు పూర్తికానుంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ .. గౌతమ్ మీనన్ .. మిస్కిన్ .. మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Vijay
Trisha
Lokesh Kanagaraj
Leo Movie
  • Loading...

More Telugu News