Sudheer Babu: 'హరోంహర' నుంచి ఉత్కంఠను రేపుతున్న ఫస్టు ట్రిగ్గర్!

Harom Hara movie update

  • సుధీర్ బాబు హీరోగా 'హరోంహర'
  • దర్శకుడిగా జ్ఞాన సాగర్ పరిచయం 
  • సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్ 
  • డిసెంబర్ 22వ తేదీన సినిమా విడుదల

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. కొత్తగా అనిపించే పాత్రలను మాత్రమే చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన నుంచి రావడానికి మరో సినిమా రెడీ అవుతోంది .. అదే 'హరోంహర'. 

ఈ రోజున సుధీర్ బాబు పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు ట్రిగ్గర్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఓ వర్షం కురుస్తున్న రాత్రి కొంతమంది రౌడీలు జీప్ నుంచి దిగుతారు. వాళ్ల చేతుల్లో వేటకొడవళ్లు .. గన్స్ ఉంటాయి. 'అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు .. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది' అనే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. 

ఈ సినిమాలో సుధీర్ బాబు .. సుబ్రమణ్యం పాత్రలో కనిపించనున్నాడు. సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ వీడియో చూస్తుంటే కంటెంట్ డిఫరెంట్ గానే ఉండేలా అనిపిస్తోంది. 

More Telugu News