naresh: బోల్డ్‌గా నరేశ్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్

 Malli Pelli Trailer released

  • తమ నిజ జీవితాన్నే తెరపై చూపిస్తున్న నరేశ్
  • ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం
  • ఈ నెల 26 విడుదల చేస్తున్నట్టు ప్రకటన

సీనియర్ నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్ పై నరేశ్ సొంతంగా నిర్మిస్తున్నారు. తన వైవాహిక జీవితాన్నే నరేశ్ తెరపై చూపెట్టనున్నారు. కొన్నాళ్లుగా కలిసి ఉంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నరేశ్, పవిత్ర జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నరేంద్రగా నరేశ్, పార్వతిగా పవిత్ర కనిపిస్తున్నారు. నరేశ్  నిజ జీవితంలో మూడో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.

‘పార్వతీ, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా’ అని నరేశ్.. పవిత్రను అడగడంతో మొదలైన ట్రైలర్ లో వారి మధ్య పరిచయం ప్రేమగా మారడం నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు హోటల్ ఎపిసోడ్, మూడో భార్యను ఆయన తన్నడం వరకు చూపెట్టారు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను బోల్డ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హీరో (నరేశ్) వెయ్యి కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్టు చూపించేలా ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే.. అంటూ వనితా విజయ్ కుమార్ తో డైలాగ్ చెప్పించారు. నటి అన్నపూర్ణ డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
.

More Telugu News